స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల ఆలస్యంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్రాధాన్యత పనులు త్వరగా పూర్తి చేయాలని, ఆలస్యమైతే బిల్లుల చెల్లింపులు ఆపేస్తామని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష హెచ్చరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు.
గరుడ వారధి నిర్మాణాలను మొదట పూర్తి చేయటం ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని గిరీష అభిప్రాయపడ్డారు. హరిచంద్ర శ్మశాన వాటికలో బర్నింగ్ సిస్టంల పనులు త్వరగా పూర్తి చేస్తే శ్మశానవాటికలో ఖననాల సంఖ్య తగ్గుతుందన్నారు. సౌర విద్యుత్ కేంద్రం, తడి, పొడి చెత్త వేరుచేసే ప్లాంట్, సిమంట్ రోడ్డు నిర్మాణాలు నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.
నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో కోకో, వాలీబాల్, బ్యాడ్మెంటన్ కోర్టు నిర్మాణాల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే బిల్లులు మంజూరు చేయమని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: '
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి ?'