చిత్తూరు జిల్లా తితిదే పరిధిలోని బర్డ్(బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్ర)ను కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా, తితిదే ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్విమ్స్ ఆసుపత్రి కొవిడ్ రాష్ట్ర ఆసుపత్రిగా 350 పడకలతో బాధితులకు సేవలందిస్తోంది. అయినా బెడ్లు సరిపోకపోవటంతో బర్డ్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించాలని నిర్ణయించారు. దీంతో అదనంగా మరో 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
తితిదే పరిధిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, మాధవం భక్తుల వసతి సముదాయాలను కొవిడ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు విష్ణు నివాసంను కొవిడ్ కేర్ సెంటర్‌గా మారుస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి...