తిరుమల అన్నమయ్య భవన్‌లో పలు నాటకీయ పరిణామాల మధ్య తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హుందాతనంగా జరపాల్సిన కార్యక్రమం రసాభాసాగా ముగిసింది.
సభ్యుల అసహనం... ఇద్దరు రాజీనామా
తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి . సమావేశం నిర్వహించేందుకు మండలికి ఆహ్వానం పంపి... తీరా ప్రారంభమయ్యే సరికి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంత సేపయినా వారు తిరిగి రాకపోవటంలో సభ్యులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ నేపధ్యంలో సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి సమావేశమందిరం నుంచి బయటకు వచ్చారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కారును ఆపి... కారుపైనే రాజీనామా పత్రంపై సంతకం చేసి ఈవోకు అందజేశారు. దర్మకర్తల మండలిని అధికారులు ఎప్పుడూ అవమాన పరుస్తున్నారని చల్లా విమర్శించారు. మరో సభ్యులు పొట్లూరి రమేష్‌బాబు సైతం రాజీనామా చేశారు.
సమావేశం నిలిపివేసిన పుట్టా....
అధికారుల కోసం ఎదురు చూసిన తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్... మండలి సమావేశంను అర్థాతరంగా ఆపివేశారు. బోర్డు సమావేశం నిర్వహించాలని అధికారులే నెల రోజుల క్రితం నిర్ణయించారని తీరా సమావేశం ప్రారంభమయ్యేసరికి... అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా పరిణామాల దృష్ట్యా ...దైవసన్నిధిలో తమకు తాముగా రాజీనామా చేయలేమని... ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పుట్టా తెలిపారు.
సర్వత్రా విమర్శలు...
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో జరిగే పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం ఆసక్తిచూపుతుంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉన్నతాధికారులు రాజకీయ కేత్రంగా మారుస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో... తెదేపా ప్రభుత్వం నియమించిన మండలి సమావేశం నిర్వహించకుండా ఈవో, జేఈవోలు చర్యలు తీసుకోవాల్సిందనే అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
'తితిదే ధర్మకర్తల మండలి సమావేశం- నాటకీయ పరిణామం' - tirumala
తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమావేశం నుంచి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు బయటకు వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి రాకపోయటంతో సమావేశం నిలిపివేశారు. తమను ఆహ్వానించి అధికారులు అవమాన పరిచారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల అన్నమయ్య భవన్‌లో పలు నాటకీయ పరిణామాల మధ్య తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హుందాతనంగా జరపాల్సిన కార్యక్రమం రసాభాసాగా ముగిసింది.
సభ్యుల అసహనం... ఇద్దరు రాజీనామా
తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి . సమావేశం నిర్వహించేందుకు మండలికి ఆహ్వానం పంపి... తీరా ప్రారంభమయ్యే సరికి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంత సేపయినా వారు తిరిగి రాకపోవటంలో సభ్యులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ నేపధ్యంలో సభ్యుడు చల్లా రామచంద్రా రెడ్డి సమావేశమందిరం నుంచి బయటకు వచ్చారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కారును ఆపి... కారుపైనే రాజీనామా పత్రంపై సంతకం చేసి ఈవోకు అందజేశారు. దర్మకర్తల మండలిని అధికారులు ఎప్పుడూ అవమాన పరుస్తున్నారని చల్లా విమర్శించారు. మరో సభ్యులు పొట్లూరి రమేష్‌బాబు సైతం రాజీనామా చేశారు.
సమావేశం నిలిపివేసిన పుట్టా....
అధికారుల కోసం ఎదురు చూసిన తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్... మండలి సమావేశంను అర్థాతరంగా ఆపివేశారు. బోర్డు సమావేశం నిర్వహించాలని అధికారులే నెల రోజుల క్రితం నిర్ణయించారని తీరా సమావేశం ప్రారంభమయ్యేసరికి... అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా పరిణామాల దృష్ట్యా ...దైవసన్నిధిలో తమకు తాముగా రాజీనామా చేయలేమని... ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పుట్టా తెలిపారు.
సర్వత్రా విమర్శలు...
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో జరిగే పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం ఆసక్తిచూపుతుంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉన్నతాధికారులు రాజకీయ కేత్రంగా మారుస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో... తెదేపా ప్రభుత్వం నియమించిన మండలి సమావేశం నిర్వహించకుండా ఈవో, జేఈవోలు చర్యలు తీసుకోవాల్సిందనే అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ట