కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు వ్యాధి కారక క్రిముల బారిన పడకుండా ఉండేందుకు ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే మహా ద్వారం మార్గాలలో వీటిని ఏర్పాటు చేశారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు భక్తులు ప్రవేశించే స్కానింగ్ సెంటర్ వద్ద, విధి నిర్వహణలో ఉన్న అర్చకులు, ఉద్యోగులు ప్రవేశించే బయో మెట్రిక్ వద్ద ట్రై ఓజోన్ పొగమంచు రూపంలో స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఉంచారు.. హైడ్రాక్సిల్ ప్రీ రాడికల్ అయాన్ వల్ల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : 13 నెలలుగా పోలవరంపై ఆన్‌లైన్లో సమాచారం వెల్లడించలేదు'