ETV Bharat / state

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధికారులు విడుదల చేశారు. జులై నెలకు సంబంధించిన టికెట్లను తితిదే వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు.

author img

By

Published : Jun 29, 2020, 1:25 PM IST

tirumala seva
tirumala seva

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించిన టికెట్లను తితిదే వెబ్‌సైట్​లో అధికారులు విడుదల చేశారు. రోజుకు 9 వేల టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావాలనుకునే భక్తులు tirupathibalaji.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసపోవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది.

కొవిడ్ ‌- 19 నిబంధనల మేరకు 10 సంవత్సరాలలోపు వారికి.. 65 సంవత్సరాలు పైబడిన వారికి టికెట్లు పొందేందుకు అవకాశం లేదని తెలిపింది. సాధారణ భక్తుల కోసం మంగళవారం ఉదయం నుంచి రోజుకు మూడు వేల టిక్కెట్ల చొప్పున ఉచిత టైంస్లాట్‌ టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవీ కాంప్లెక్స్‌ వద్ద టోకెన్లు జారీ చేయనున్నారు. దర్శనం కోరుకునే వారు ఒక్కరోజు ముందు ఈ కేంద్రాల ద్వారా టైంస్లాట్‌ టోకెన్లను పొందాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: చమురు ఆగ్రహం: కాంగ్రెస్​ దేశవ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.