చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తెరిచి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పట్టణాన్ని లాక్ డౌన్గా ప్రకటించారు పోలీసులు. విషయం తెలియని భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ వెళ్లే దారిని మూసివేయటంతో.. ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
లాక్ డౌన్ విషయం ముందుగానే చెప్పి ఉంటే తాము రాకుండా ఉండేవాళ్లమని చెప్పారు. దుకాణాలు మూసి ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంచినీరు, ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. తితిదే అధికారులు, పోలీసులు స్పందించి గుడికి వెళ్లే మార్గానికి సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయినా పట్టణం లాక్ డౌన్లో ఉన్నప్పుడు ఆలయం మాత్రం ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి...