ETV Bharat / state

పోలీసుల వలయంలో తుళ్లూరు... 700 మందితో బందోబస్తు - మంత్రి వర్గ సమావేశంలో శాంతి భద్రతల చర్యలో భాగంగా  మంత్రి వర్గ సమావేశం మీడియా సమావేశం

మంత్రి వర్గ సమావేశం దృష్ట్యా తుళ్లూరులో భారీగా పోలీసులు మోహరించారు. మండలంలోని రాజధాని గ్రామాల్లో 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మందడంలో పాలు, మందులు దుకాణాల నిర్వహణకు మాత్రమే పోలీసుల అనుమతి ఇచ్చారు.

thulluru dsp press meet for capital city protest
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు..: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Dec 27, 2019, 7:02 AM IST

Updated : Dec 27, 2019, 11:13 AM IST

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు..: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

రాజధాని అమరావతిలోని రైతుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రులు, సీఎం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోవైపు ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌, అగ్నిమాపక దళాలు మోహరించాయి.

చర్యలు తప్పవు

మంత్రివర్గ సమావేశం దృష్ట్యా మందడం రైతుల ధర్నాకు అనుమతి ఇవ్వలేదని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. దాదాపు 700మంది పోలీసులను తుళ్లూరు పరిధిలో మోహరించామని డీఎస్పీ అన్నారు. ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ పెట్టామని చెప్పారు.
ఇదీ చదవండి:

నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

Intro:Body:

tulluru dsp

Conclusion:
Last Updated : Dec 27, 2019, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.