చిత్తూరు జిల్లాలో.. మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో.. సర్పంచ్ పదవికి వేసిన నామినేషన్లను తిరస్కరించడంపై దుమారం రేగింది. మెట్ట చింతవారిపల్లెలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తిరస్కరించారంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ పంచాయతీలో మూడోదశ ఎన్నికకు.. ఒకే పార్టీ బలపరిచిన ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే.. ఒకరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించటంపై ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి సర్దిజెప్పేందుకు యత్నించినా లాభం లేకపోవటం వల్ల.. అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా వారిని తరలించారు.
ఇవీ చూడండి...: ఓటరు స్లిప్పులపై పార్టీ మద్దతు గుర్తులు.. అభ్యర్థుల ఆందోళనలు