చిత్తూరు జిల్లా పుత్తూరు ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు పనిభారం పెంపు వంటి చర్యలను వెంటనే ఆపాలన్నారు. ఆర్టీసీ బస్సులు పెంచి అద్దె బస్సులు తగ్గించాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 60 సంవత్సరాల వరకూ పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు. డిజిటల్ చాట్ల విధానాన్ని ఆపాలని ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో సమ్మె చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు.
ఇవీ చదవండి... ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు