చిత్తూరు శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈకేసుతో ఇప్పటివరకూ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. 8మంది డిశ్ఛార్జ్ కాగా...కోలుకున్న వారి సంఖ్య 45కు చేరింది. ఫలితంగా జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 37కి తగ్గింది.
మద్యం దుకాణాలు తెరవడంతో జిల్లా వ్యాప్తంగా దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన బలిజకండ్రిగకు పక్క రాష్ట్రం నుంచి మద్యంప్రియులు వస్తున్నందున అధికారులు దుకాణాలను మూసివేశారు.
ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో మద్యం దుకాణాల వద్ద మహిళలు ఆందోళన చేయడంతో అధికారులు షాపులను మూసివేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపించాలంటూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు.
ఇదీచదవండి.