ETV Bharat / state

'జగన్‌ ప్రభుత్వం ముస్లిం వర్గాన్ని వేధిస్తోంది.. మూల్యం తప్పదు' - Andhra Pradesh top news

Chandra babu Fire on CM Jagan: ‘రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గాన్ని వేధిస్తోన్న జగన్ ప్రభుత్వం.. అతి త్వరలోనే భారీ మూల్యం తప్పక చెల్లిస్తుంది' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ముస్లిం వర్గాలకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ఇప్పటివరకూ ముస్లింలపై 72 దౌర్జన్యాలు జరిగాయని అన్నారు.

Nara chandra babu
తెలుగుదేశం అధినేత
author img

By

Published : Feb 3, 2023, 10:43 PM IST

Chandra babu Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలపై దాడులు చేస్తూ..ఇప్పుడు సొంత పార్టీ వారిపైనా కూడా దాడులు చేయటం మొదలుపెట్టిందని.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు. రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గాన్ని వేధిస్తోన్న జగన్ ప్రభుత్వం.. అతి త్వరలోనే మూల్యం తప్పక చెల్లిస్తుందని ధ్వజమెత్తారు. ముస్లిం వర్గాలకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ఇప్పటివరకూ ముస్లింలపై 72 దౌర్జన్యాలు జరిగాయని పలు సంఘటనల వివరాలను వెల్లడించారు.

తమకు అండగా నిలవాలని కోరుతూ ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలపై రోజురోజుకు దాడులు, వేధింపులు పెరిగాయని నేతలు చంద్రబాబుకు వివరించారు. ఇప్పటివరకు ముస్లింలపై 72 ఘటనలు జరిగాయని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని, ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలవాలని చంద్రబాబును విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 70శాతం వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అయ్యాయని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొన్న వేధింపులను పలువురు బాధితులు మీడియా ముందు వివరించారు. అనంతరం చంద్రబాబు వారితో మాట్లాడుతూ..అధికార పార్టీ ప్రోద్భలంతో దాడులకు గురవుతున్న ముస్లిం వర్గానికి తెలుగుదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం వర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు.

జగన్‌ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తుంది

వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలపై దాడులు చేస్తూ.. ఇప్పుడు సొంత పార్టీ వారిపైనా కూడా దాడులు చేయటం మొదలుపెట్టింది. ఆ పార్టీలో ఉన్న వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ముస్లిం వర్గాన్ని వేధిస్తున్న జగన్‌ ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లిస్తుంది. ముస్లిం వర్గాలకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది.- చంద్రబాబు, టీడీపీ అధినేత

రాష్ట్రంలో ముస్లింపై దాడులు, వేధింపుల్లో 72 ఘటనలు జరిగాయని.. వెలుగు చూడని ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ముస్లిం వర్గంపై దాడులు విషయంలో, వక్ఫ్‌బోర్డు ఆస్తుల రక్షణ విషయంలో సమితి చేస్తున్న పోరాటాన్ని అభినందనీయమన్నారు. ముస్లిం మహిళపై దేశ ద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టడం, వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన మున్వర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.