నేటి నుంచి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కరోనా దృష్ట్యా ఏకాంతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు వినాయక చవితి పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవలను జరపనున్నారు.
అలాగే ఈ నెల
- 12న నెమలి, 13న మూషిక, 14న శేషవాహన సేవలు
- 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ సేవలు
- 16న గజ సేవ, 17న రథోత్సవం
- 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ
- 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయత్తు ఉత్సవంతో పాటు ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వరసిద్ధి వినాయక స్వామికి .. ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అతిథి గృహానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఈవో స్వాగతం పలికారు. ఆస్థాన మండపంలో నిర్వహించిన వినాయక వ్రతకల్పం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మూషిక మండపంలో తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆలయంలోని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండీ.. Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?