ETV Bharat / state

భవనం కూల్చివేతలో ప్రమాదం.. బలైన బాలుడి ప్రాణం - తిరుపతి నేర వార్తలు

తిరుపతి నగరం కోటకొమ్మలవీధిలో భవనం కూల్చివేస్తున్న ఘటనలో ప్రమాదం జరిగింది. 14 సంవత్సరాల బాలుడిపై సిమెంటు పెళ్లలు పడ్డాయి. ఈ ఘటనలో.. బాలుడు మృతి చెందాడు.

భవనం కూల్చివేతలో ప్రమాదం.. బలైన బాలుడి ప్రాణం

author img

By

Published : May 30, 2020, 10:50 AM IST

Updated : May 30, 2020, 4:27 PM IST

తిరుపతి నగరంలోని కోటకొమ్మల వీధిలో భవనం కూల్చివేత ఘటన.. ఓ బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. నగరపాలక ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తుండగా సిమెంటు పెళ్లలు ఎగిరి అక్కడ ఆడుకుంటున్న బాలుడిపై పడ్డాయి.

ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాలుడిని స్విమ్స్​కు తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఘటనాస్థలంలో విచారణ చేశారు.

ఇదీ చదవండి:

కరోనాతో దేశంలో ఒక్కరోజే 265 మంది బలి

Last Updated : May 30, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.