ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల వేళ...మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు - chittoor district latest news

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతమాకుల పల్లె సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు.. వైకాపా కార్యకర్తలు లాక్కెళ్లగా... ఏతూరు గ్రామంలో తెదేపా మద్దతుదారునికి చెక్ లిస్ట్ ఇవ్వకుండా అధికారులు వెనక్కు పంపారు.

tensions in minister peddireddy constituency in chittoor district
పంచాయతీ ఎన్నికల వేళ...మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు
author img

By

Published : Feb 8, 2021, 8:07 AM IST

చిత్తూరు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి. చౌడేపల్లె మండలంలో చింతమాకుల పల్లె గ్రామ పంచాయతీకి సర్పంచ్​గా నామినేషన్ వేసేందుకు వెళుతున్న భాజపా మద్దతుదారు రజినీ ... భర్త చిన్ని కిషోర్​పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. పుంగనూరు మండలం ఏతూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా బలపరచిన మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అన్ని పత్రాలు సమర్పించినా చెక్ లిస్ట్ ఇవ్వకుండా అధికారులు వెనక్కు పంపారని నామినేషన్ కేంద్రం వద్ద బాధితులు నిరసనకు దిగారు.

మూడో విడత ఎన్నికలు జరుగుతున్న 279 గ్రామపంచాయతీలకు రెండోరోజు 662 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలో 289, పుంగనూరు నియోజకవర్గ పరిధిలో 157, పలమనేరు నియోజకవర్గం పరిధిలో 216 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేశారు. చౌడేపల్లె మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.

ఇదీ చదవండి: నామపత్రాలు లాక్కెళ్లిన వారిని శిక్షించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.