ETV Bharat / state

Protest: అంబేద్కర్ చిత్రపటం తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత.. స్పృహతప్పి పడిపోయిన మహిళ

author img

By

Published : Dec 22, 2021, 1:07 PM IST

Protest Over Removed Ambedkar Frame: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం శివాజీ నగర్‌లో అంబేడ్కర్​ చిత్రపటం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులు, ఎస్సీలకు మధ్య జరిగిన తోపులాటతో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయారు.

అంబేద్కర్ చిత్రపటం తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత

Tension over removed Ambedkar photo Frame in Chittoor district: అంబేడ్కర్ చిత్రపటం తొలగింపు చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రామకుప్పం మండలంలోని శివాజీ నగర్‌లో ఓ స్థూపంపై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ చిత్రపటాన్ని మంగళవారం అర్థరాత్రి తొలగించారు. ఈ ఘటనను నిరసిస్తూ.. దళితులు ఆందోళనకు దిగారు. తొలగించిన చిత్రపటాన్ని తిరిగి పెట్టడానికి దళితులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో దళితులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

దీనికి నిరసనగా.. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయారు. అంబేడ్కర్​ చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ.. పోలీసులు, తహసీల్దార్​ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అందోళన కొనసాగించారు.

ఇదీ చదవండి..

Student Suicide: తండ్రి మందలిస్తాడేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.