చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని మాంబేడు, ఆర్కే ఎం పురం పోలింగ్ బూత్‌లలో అధికార పార్టీ మద్దతుదారులు... తమపై దాడి చేశారంటూ బూత్ ఏజెంట్లు, అభ్యర్థులు ఆందోళనకి దిగారు. పోలింగ్ కేంద్రాల్లో ఎవరికి ఓటు వేయాలో అధికారులే చెబుతున్నారంటూ ఆరోపణలు చేశారు. మాంబేడు పంచాయతీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు.
ఎస్ఆర్ పురంలో
మండలంలోని కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి ఒకరు కొత్తపల్లి మిట్ట పోలింగ్ కేంద్రం 5వ బూత్ బ్యాలెట్ బాక్స్‌లో నీళ్లు పోశారని ఆరోపణలు రావటంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ఆపివేసిన ఎన్నికల అధికారులు.. పోలీసుల సాయంతో అందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకి పంపారు.
ఇదీ చదవండి: వైకాపా నేతల దౌర్జన్యంపై చంద్రబాబు ధ్వజం