తిరుపతి రుయా ఘటనలో మృతి చెందిన జయచంద్ర అనే కరోనా బాధితుడి కుటుంబాన్ని మేయర్ డా. శిరీష, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పరామర్శించారు. సుందరయ్య నగర్లో ఉన్న మృతుడి ఇంటికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు.. ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున పరిహారం రూ.పది లక్షల చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు