ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఆ పిటిషన్​పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - AP Latest news

High court on MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని బీజేపీతో పాటు ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మరోసారి నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు
ఎమ్మెల్యేలకు ఎర కేసు
author img

By

Published : Dec 6, 2022, 10:58 PM IST

High court on MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టులను ఉపయోగించుకొని విచారణను ఆలస్యం చేస్తున్నారని... బీఎల్ సంతోష్ విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని సిట్ తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే హైకోర్టును కోరారు. సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించిందని... ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని దవే అన్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని బీజేపీతో పాటు ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్​పై వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తు ఎంతో కీలకమని కేసు ప్రారంభ దశలోనే ఉందని... ఈ సమయంలో సీబీఐకి అప్పజెప్పాలని బీజేపీ వాదించడం సరైంది కాదని సిట్ తరఫు న్యాయవాది దవే వాదించారు. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని బీజేపీ తరఫు న్యాయవాది మహేష్ జఠ్మలానీ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు ఇదే కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. భాజపా నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమో తిరస్కరణకు గురైంది. నలుగురిని నిందితులుగా చేరుస్తూ గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో మొయినాబాద్‌ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. మెమోను కొట్టివేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.