చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధిలోని కొమరగుంట పంచాయతీ సద్దికూళ్లపల్లెకు చెందిన సువ్వాల యశోదమ్మ, వెంకటరెడ్డి కుమారుడు పద్మనాభరెడ్డి. విద్యలో రాణించిన ఆయన... స్వీడన్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అమెరికాలో ఓ పేరున్న కంపెనీలో ఆరంకెల జీతంతో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా కొలువు సంపాదించారు. పది మందిలో గర్వంగా చెప్పుకొనే అవకాశమున్న ఈ ఉద్యోగం.. విదేశంలో జీవితం.. పద్మనాభరెడ్డికి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు.
ఇంజినీర్ నుంచి అన్నదాతగా.. ఆపై మానవతావాదిగా..!
ఆరంకెల జీతం.. పైగా అమెరికాలో ఉద్యోగం.. అయినా తృప్తి లేని జీవితం... ఇంకా ఏదో సాధించాలన్న తపన. జన్మభూమికి తనవంతు ఏదైనా చేయాలనే కుతూహలం. అంతే.. ఓ రోజు నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా స్వదేశానికి వచ్చేశాడు. వచ్చీ రావడంతోనే విదేశాల్లో తాను గమనించిన అంశాలకు కార్యరూపం కల్పించాడు. తనకున్న పదెకరాల పొలంలో విభిన్న పంటల సాగుతో అన్నదాతగా మారిపోయాడు. ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇంజినీర్ నుంచి అన్నదాతగా
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధిలోని కొమరగుంట పంచాయతీ సద్దికూళ్లపల్లెకు చెందిన సువ్వాల యశోదమ్మ, వెంకటరెడ్డి కుమారుడు పద్మనాభరెడ్డి. విద్యలో రాణించిన ఆయన... స్వీడన్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అమెరికాలో ఓ పేరున్న కంపెనీలో ఆరంకెల జీతంతో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా కొలువు సంపాదించారు. పది మందిలో గర్వంగా చెప్పుకొనే అవకాశమున్న ఈ ఉద్యోగం.. విదేశంలో జీవితం.. పద్మనాభరెడ్డికి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు.
అమెరికాలో సమయం కుదిరినప్పుడల్లా పలు చోట్ల తిరుగుతూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు పద్మనాభరెడ్డి. వాటిని ఆచరణలో పెట్టడానికే అమెరికా ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వగ్రామం చేరుకున్నారు. తమకున్న పదెకరాల వ్యవసాయ పొలాన్ని ప్రత్యేక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. పదెకరాల పొలాన్ని పలు విభాగాలుగా చేసి తైవాన్ రకం జామ మొక్కలు నాటారు. మిగిలిన భూమిలో అల్లనేరేడు 500, ఎర్రచందనం రెండు వేలు, సిలోన్ రకం కొబ్బరి చెట్లు 200, జామ తోటకు రక్షణగా చుట్టూ టేకు మొక్కలు సాగుచేశారు.
ప్రభుత్వ పథకాలే..
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ.. విభిన్న రకాలైన పంటలు సాగుచేయడమే కాకుండా ప్రభుత్వం రాయితీ ద్వారా అందించే అన్ని పథకాలను పద్మనాభరెడ్డి అందిపుచ్చుకున్నారు. సాగుకు కావాల్సిన బోరు బావులను ఉపాధిహామీ పథకం ద్వారా తవ్వించారు. అదే పథకంతో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోడానికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. ఓ వైపు ప్రభుత్వ పథకాల ఆసరా... మరో వైపు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు లాభాలు సాధిస్తున్నారు.
తోటి రైతులకు సాయంగా..
కడుపులో చల్ల కదలకుండా శీతల గదుల్లో కొలువుతో లక్షల రూపాయల జీతం వస్తున్నా లేని సంతృప్తిని... వ్యవసాయం ద్వారా పొందుతున్నానంటున్నారు.. బీటెక్ రైతు పద్మనాభరెడ్డి. అక్కడితో ఆగకుండా... తోటి రైతులకు తన వంతు సాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సహ రైతులను ఆదుకొనేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొనేలా రైతులను చైతన్యపరుస్తున్నారు.

Lucknow (UP), May 05 (ANI): While speaking exclusively to ANI, Samajwadi Party president Akhilesh Yadav criticised Prime Minister Narendra Modi's remark on 'Mahagathbandhan' and said, "Prime Minister's language has changed because BJP is lagging behind in previous phases of elections. BJP can see no other way. They are not talking about development, farmers' income. Prime Minister just wants to mislead people. SP-BSP-RLD will decide, who will form the government and be the PM. He (PM Modi) is a 180 degree PM, he does just the opposite of whatever he says. He is the PM of only 1% of the population."