ETV Bharat / state

'రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువైంది'

author img

By

Published : Nov 10, 2020, 8:36 PM IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రక్షణ కల్పించాలని తెదేపా పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెదేపా నేతలు ఆరోపించారు.

తిరుపతిలో మాట్లాడుతున్న తెదేపా నేతలు
తిరుపతిలో మాట్లాడుతున్న తెదేపా నేతలు

రాష్ట్రంలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్రం హోం శాఖ జోక్యం చేసుకోవాలని తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీస్​శాఖపై నమ్మకం పోతుందని విమర్శించారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ, కానిస్టేబుల్​ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో...
రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు రక్షణ కల్పించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై కపట ప్రేమ చూపించి ఇప్పుడు వారిపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు

కర్నూలు జిల్లాలో..
వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ లేకుండాపోయిందని తెలుగుదేశం ఆరోపించింది. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్​ సలాం కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కోసం కర్నూలులో ఆ పార్టీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడినవారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

గట్టెక్కిన శివరాజ్​ సర్కార్​- 'సింధియా'కు నయా జోష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.