ETV Bharat / state

'సంక్రాంతిలోపు అర్హులకు ఇళ్ల కేటాయింపులు చేయాలి' - tdp leaders fires about tidco homes news

నా ఇల్లు నాసొంతం- నా ఇంటిపట్టా నాకివ్వండి అంటూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెదెపా నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సంక్రాంతిలోపు ఇళ్ల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.

'నా ఇల్లు నా సొంతం- నా ఇంటి పట్టా నాకివ్వండి'

author img

By

Published : Nov 7, 2020, 5:10 PM IST

పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై గొల్లపల్లి రోడ్ల కూడలి వద్ద చిత్తూరు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు నాని ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. చిత్తూరులో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు తెదేపా నేతలు ఆందోళనకు చేపట్టారు. మదనపల్లె పట్టణ శివారులోని తట్టివారిపల్లె వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో భవనాల వద్ద నియోజకవర్గ ఇన్​ఛార్జి రమేష్‌ ఆధ్వర్యంలో నిరసన చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. సంక్రాంతి లోపు ఇళ్ల కేటాయింపులు జరపకపోతే అర్హులైన వారితో ఖాళీగా ఉన్న గృహాల్లో ప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి: 'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.