ETV Bharat / state

సీఎం జగన్​ అభివృద్ధిని ఆపి రాష్ట్రాన్నే చంపేశాడు : నారా లోకేశ్​ - సీఎం జగన్​

nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం​ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 13వ రోజు పాదయాత్రను ప్రారంభించే ముందు లోకేశ్​ బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ బేటీలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను ఎండగట్టారు.

nara lokesh
నారా లోకేశ్​
author img

By

Published : Feb 8, 2023, 1:56 PM IST

Nara Lokesh : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి అభివృద్ధిని ఆపేసి రాష్ట్రాన్ని చంపేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. చిత్తూరు నియోజకవర్గం దిగువమాసపల్లి నుంచి 13వ రోజు లోకేశ్‍ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు బీసీ నేతలతో, లోకేశ్​ సమావేశమయ్యారు. టీడీపీ హయంలో బీసీల కోసం నిర్వహించిన పలు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను లోకేశ్​ గుర్తు చేశారు. సీమ జిల్లాల నుంచి వలసలు ఎక్కువయ్యాయని అన్నారు. అధికారంలోకి రాగానే కార్పోరేషన్లకు నిధులు కేటాయించి బీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించరాని దుయ్యబట్టారు. 90 శాతం పూర్తైన బీసీ భవనాల నిర్మాణ పనులను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.

ప్రభుత్వ సలహదారుల్లో 70 శాతం సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే నియామించరాని ఆరోపించారు. పాడిరైతుల గురించి మాట్లాడితే పేటియం బ్యాచ్ ట్రోలింగ్ చేస్తోందని దుయ్యబట్టారు. రైతులకు డ్రిప్, ఇతర వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధికి.. ఆదరణ పథకం కింద మొదటి విడతలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రెండో విడత కోసం సామాగ్రి కొనుగోలు చేసి పంపీణి మొదలయ్యే సరికి ఎన్నికల నియామవళి వచ్చిందని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.