చిత్తూరు జిల్లాలో అమరావతి నినాదం మార్మోగింది. రాజధాని రైతులకు మద్దతుగా జిల్లాలోని తెదేపా శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో తెదేపా నాయకులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలంలో జిల్లా తెదేపా కార్యదర్శి మోహన్ మురళి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్‌కు అందజేశారు.
పుత్తూరులో తెదేపా శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా తిరుపతి రూరల్ మండలంలో చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఆర్టీవో కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామవని చెప్పారు.
ఇదీ చదవండి: