ETV Bharat / state

'ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా..?' - tdp leaders fires on cm jagan

ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని తెదేపా నేతలు ప్రశ్నించారు. తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fires on detain of chandra babu at renigunta airport

author img

By

Published : Mar 2, 2021, 8:41 AM IST

తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్బంధించడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇన్​ఛార్జ్ పమిడి రమేశ్ ఆరోపించారు. చిత్తూరులో పర్యటిస్తే వైకాపా అక్రమాలు బయటపడతాయని భయపడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఆటవిక పాలనకు వైకాపా పురుడుపోసిందని తెదేపా శాసనభపక్ష విప్​ డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చీకటి రాజ్యం అలుముకుందని విచారం వ్యక్తం చేశారు. నేతలను నిర్బంధిస్తే ప్రజా సమస్యలు తీరవని జగన్ ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు.

ప్రజాస్వామ్యం, పరిపాలన గురించి తెలియని అంబటి రాంబాబు చంద్రబాబు గురించి మాట్లాడటం విచిత్రమని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారని అంబటికి తెలియదా అని నిలదీశారు.

ప్రజారోగ్యం.. ఎన్నికల నియమావళి దృష్ట్యా తెదేపా నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించామని.. కార్యక్రమానికి ఎస్‌ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలని లేదా శివారు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలని సలహా ఇచ్చామని.. అయినా వినకపోవడంతో ముందస్తుగా నేతలను గృహనిర్బంధం చేయాల్సి వచ్చిందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రేణిగుంటకు చంద్రబాబు.. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.