ETV Bharat / state

మీ బండారం.. మీ పార్టీ వాళ్లే బయటపెడుతున్నారు : సోమిరెడ్డి - Somireddy Chandramohan Reddy warned YSRCP leaders

Somireddy Chandramohan Reddy Comments on YSRCP: లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి హెచ్చరించారు. లోకేశ్ పాదయాత్రపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

Somireddy Chandramohan Reddy
సోమిరెడ్డి
author img

By

Published : Feb 13, 2023, 11:21 AM IST

Somireddy Chandramohan Reddy Comments on YSRCP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై.. వైఎస్సార్సీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు అన్నారు.

లోకేశ్ పాదయాత్రకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తే.. ప్రజలు తిరగబడతారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి హెచ్చరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొల్లకండ్రిగ భోజన విడిది కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన రోజే చెప్పామని.. లోకేష్ పాదయాత్ర చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తట్టుకోలేదని అన్నారు.

లోకేశ్ పాదయాత్రను చూస్తేనే ఇలా భయపడిపోతుంటే.. చంద్రబాబు రోడ్డుపైకి వస్తే ఏమైపోతారని ధ్వజమెత్తారు. నాడు జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్​లో రన్ వేపై కూర్చొని నిరసన చేశాడని.. ఆ విధంగా లోకేశ్‍ తిరగబడితే పోలీసులు తట్టుకోలేరన్నారు. పోలీసులు డ్రోన్​లను భద్రతకు వినియోగించకుండా.. లోకేశ్ పాదయాత్రపై అసత్య ప్రచారాలు చేయడానికి‌ వాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

"తెలుగుదేశం మీద బురద చల్లడం.. తెలుగుదేశం వాళ్లు చెబితే అబద్ధం అని చెప్పడం చెస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీ వాళ్లే చెప్తున్నారు.. మీ బండారం బయటపెడుతున్నారు. టీడీపీలో మెయిన్ వ్యక్తిని అని మేమే చెప్పుకోము. ఇంచార్జ్ అని చెప్తాం. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎవరైనా మంచి వాళ్లు పార్టీలోకి వస్తే తీసుకుంటాం. ఆ నిర్ణయాలు రాష్ట్ర నాయకత్వం.. జిల్లా నాయకత్వం కలసి తీసుకుంటారు". - సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి, మాజీ మంత్రి

వైఎస్సార్సీపీ నేతలకు సోమిరెడ్డి హెచ్చరిక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.