తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు వేసే వాళ్లను అడ్డుకోవడం, ఇప్పటికే వేసిన వారిని బలవంతపు ఉపసంహరణలపై జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఫిర్యాదు చేశామని... తిరుపతి మాజీఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. నామినేషన్ వేసిన వారిలో ఏడుగురిని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని సుగుణమ్మ ఆరోపించారు. మరో 11 ప్రాంతాల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.
ఇదీచూడండి: సఖినేటిపల్లిలో సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి