చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో... తెదేపా నాయకుల నామినేషన్ పత్రాలను వైకాపా శ్రేణులు చించివేశారు. నామినేషన్ల చివరి రోజైన నేడు... కుప్పం 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఏంపీపీ వెంకటేష్ పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. సమాచారం అందుకున్న మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడ్డ వెంకటేష్ ను ఆస్పత్రికి తరలించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం ముగియనుంది. దీంతో ఆ అభ్యర్థి ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: Amaravati Farmers: ఐదో రోజు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర