పురపోరు ప్రచారానికి నేటితో ముగియనుండటంతో చిత్తూరు జిల్లా నగరి, పుత్తూరులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం చేశారు. నగరి, పుత్తూరు వైకాపా అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి... తెదేపా అభ్యర్థుల కొసం నగరి ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్ ప్రచారం చేశారు.
నగరి మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డులకు గాను 22 వార్డులకు... పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డులకు గాను 26 వార్డులకు ఎన్నికలు 10 న ఎన్నికలు జరుగనున్నాయి. ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వానేనా అంటూ విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు.. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 5 నుంచి తమ ప్రచారాలకు శ్రీకారం చుట్టిన నాయకులు అభ్యర్థులకు 8 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం గడువు ఉండటంతో తమ తమ అభ్యర్ధులను గెలిపించాలని పురవీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 10 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. అభ్యర్థుల భవితవ్యం మార్చి 14 న ఓట్లు లెక్కింపుతో తేలనుంది.
ఇదీ చూడండి. మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ