tdp activists protest at kuppam: తమ పార్టీ శ్రేణులపై వైకాపా దాడులను నిరసిస్తూ.. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. తెదేపా కార్యకర్త మురళిపై దాడికి నిరసనగా.. పీఎస్ ఎదుట బైఠాయించారు. తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో.. ఆందోళన విరమించారు.