ETV Bharat / state

తెలుగు ఇంజినీర్లంతా క్షేమంగా ఉన్నారు: టీసీఎల్​ - latest news on telugu engineers at china

చైనాలో ఉన్న తెలుగు ఇంజినీర్లంతా క్షేమంగా ఉన్నారని... టీసీఎల్ కంపెనీ తెలిపింది. ఇంజినీర్లను హౌస్ అరెస్ట్ చేశారన్న పుకార్లు అవాస్తమని కంపెనీ స్పష్టం చేసింది. బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయంతో ఇప్పటికే టీసీఎల్ చర్చలు జరుపుతోందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇంజినీర్లను మరింత త్వరగా స్వదేశానికి తీసుకురావచ్చన్నారు.

tcl company gave clarification on telugu engineers at chaina
చైనాలో తెలుగు ఉద్యోగులపై టీసీఎల్​ స్పష్టత
author img

By

Published : Jan 30, 2020, 6:23 PM IST

చైనాలో ఇరుక్కుపోయిన తెలుగు ఇంజినీర్లంతా క్షేమంగా ఉన్నారని టీసీఎల్ కంపెనీ స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా వికృతమాలలో నూతనంగా నిర్మితమవుతున్న ఈ కంపెనీకి సంబంధించి... శిక్షణ పొందేందుకు 93మంది ఇంజినీర్ల బృందం గతేడాది చైనాకు వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశం కరోనా వైరస్ గుప్పెట్లో ఉండటంతో... వారంతా స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.

వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన 58మంది ఇంజినీర్ల ఆరోగ్యంపై పలు ఊహాగానాలు తలెత్తుతున్న నేపథ్యంలో టీసీఎల్ కంపెనీ దీనిపై స్పందించింది. ఇంజినీర్లను హౌస్ అరెస్ట్ చేశారన్న పుకార్లు అవాస్తమని కంపెనీ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ నగరంలో రాకపోకల నిషేధమైనందున వారిని తిరిగి తీసుకురావటంలో ఆటంకాలు ఏర్పడ్డాయని వివరించారు.

బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయంతో ఇప్పటికే టీసీఎల్ చర్చలు జరుపుతోందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇంజినీర్లను మరింత తొందరగా స్వదేశానికి తీసుకురావచ్చన్నారు. వారంతా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. నిరంతరం వైద్యపరీక్షలు, మందులు, నాణ్యమైన భోజనాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మరో వైపు శిక్షణ కోసం చైనాలోని షెన్జన్​కు వెళ్లిన 16మంది ఇంజినీర్లు హాంకాంగ్ చేరుకున్నారని తెలిపిన టీసీఎల్ ప్రతినిధులు..వారంతా త్వరలో స్వదేశానికి రాబోతున్నట్లు స్పష్టం చేశారు.

చైనాలోని తెలుగు ఉద్యోగులు

ఇదీ చదవండి : 'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.