కరోనా లాక్డౌన్ కారణంగా టమోటా రైతులు ఆర్థికంగా చితికిపోయారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట గొల్లపల్లికి చెందిన టమోటా రైతు నాదముని తన టమోటా పొలంలో గొర్రెలు, మేకలను వదిలివేశాడు. పంట చేతికొచ్చిన సమయంలో లాక్డౌన్ కొనసాగించడంతో కాయలను అమ్ముకోలేక పోయాడు. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవటంతో కాయలను కోయకుండా తోటలోనే వదిలివేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి డాక్టర్ సుధాకర్‌ను కోర్టు ఎదుట హాజరుపరచండి: హైకోర్టు