ETV Bharat / state

టమాటా రైతుల కష్టాలు.. గోడు తీర్చేదెవరు?

కడప జిల్లాలో టమాటా రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంట వర్షాల కారణంగా తెగుళ్ళ బారినపడి నాశనమైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకూ శ్రమించినా.. ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు.

author img

By

Published : Dec 22, 2019, 8:03 AM IST

tamato farmers problems in kadapa district
టమాట రైతుల కష్టాలు
టమాట రైతుల కష్టాలు

కడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 20 వేల హెక్టార్లకుపైగా టమాటా సాగు అయ్యింది. తెగుళ్లు, అధిక వర్షాలతో కాయలు పాడైపోయాయి. ఇందుకు తోడు దళారుల చేతిలో మోసపోతున్న కారణంగా.. రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.

''పంట చేతికొచ్చే సమయంలో కురిసిన చెదురు మదురు వర్షాలకు.. చెట్లకు బూడిద తెగులు సోకి కాయలు నల్లగా మాడిపోతున్నాయి. ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తే చివరికి చేతికొచ్చేది వేలల్లోనే. తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వర్షాలు, తెగుళ్ళు తట్టుకొని కాస్తోకూస్తో దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో మద్దతు ధర ఉండటంలేదు. అధిక కూలీ ఇచ్చి కాయలు తెంపించి మార్కెట్​కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోసపోతున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోసారి రవాణా ఖర్చులు రాక టమాటాలు కోసి రోడ్లమీద పారబోస్తున్నాం' అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురంలో టమాటాను అత్యధికంగా సాగు చేస్తారు. టమాటా విక్రయానికి మదనపల్లి మార్కెట్ పెట్టింది పేరు. రైతులు పంటను ఇక్కడికే ఎక్కువగా తీసుకొస్తుంటారు. తీరా ఇక్కడికొచ్చాక గిట్టుబాటు ధర లేక.. తిరిగి తీసుకెళ్లలేక దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడమో లేదా రోడ్డుమీద పారబోయడమో చేస్తున్నారు.

కడప జిల్లాలోని చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, గాలివీడు.. చిత్తూరు జిల్లాలోని కలకడ, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, గుర్రంకొండ, మదనపల్లి ప్రాంతాల్లో సుమారు 20 వేల హెక్టార్లకుపైగా టమాటా సాగు ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2, 3 నెలలపాటు పొలాల్లో శ్రమించి.. ఖర్చులన్నీ భరించి.. చివరకు ధరలేక.. చేసిన అప్పులు తీరక టమాటా రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వాలు సీమ జిల్లాల్లో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని చెప్పినప్పటికీ... ఆచరణలో అమలు కావడం లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి.. కనీసం తమకు పరిహారమైనా ఇప్పించి ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

జీఎన్‌ రావు కమిటీకి చట్టబద్ధత లేదు: రాజధాని రైతులు

Intro:కడప జిల్లాలో టమాటా రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన పంట వర్షాల కారణంగా తెగుళ్ళు రోగాల బారిన పడటం వల్ల పంట నాశనం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విత్తనం నాటిన దగ్గరనుంచి చేతికొచ్చే వచ్చే వరకు శ్రమించిన ఫలితం దక్కడం లేదన్నారు కాయలు చేతికొచ్చే సమయంలో గత నెలలో కురిసిన చెదురు ముదురు వర్షాలకు చెట్లకు బూడిద తెగులు సోకి నల్లగా మాడి పోతున్నాయి ఎన్ని పురుగుమందులు ఎరువులు వేసిన ప్రభావం చూపలేక పోతున్నాయి పురుగుమందుల కోసం అధిక ధర వెచ్చించిన నాసిరకం మందులు ఏమాత్రం దిగుబడిని పెంచడం లేదన్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చేతికి వచ్చేది వేలల్లోనే ఉండడంవల్ల నష్టాల బారిన పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు తెగుళ్ళు తట్టుకొని కాస్తోకూస్తో దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో మద్దతు ధర ఉండటం లేదన్నారు కూలీలు సరైన సమయంలో దొరకక అధిక కూలీ ఇవ్వాల్సి వస్తుందని తెలుపుతున్నారు అంత ఖర్చుచేసి కాయలు తెంపి మార్కెట్కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోస పోతున్నామని అని తెలిపారు ఇటు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని అటు వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు రైతుల దగ్గర ఒక్కోసారి ఇ రెండు పాటలు మూడు రూపాయలకు కిలో చొప్పున కొని వినియోగదారులకు మాత్రం 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు అని పేర్కొన్నారు ఒక్కోసారి ధర లేక రోడ్డుమీద పారబోయడం చెట్ల మీద వదిలేయడం చేస్తున్నామన్నారు ఒక పంట పూర్తికాకుండానే ఇంకో పంట వేయడం వల్ల ఒక దాంట్లో నష్టం వచ్చిన మరోసారి లాభం వస్తుందన్న ఆశతో వ్యవసాయం చేస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు డిమాండ్ అధికంగా ఉందని ఎక్కువ సాగుచేస్తే అది చేతికి వచ్చే వరకు ధర అమాంతం పడిపోతున్నారు పంట అమ్మిన డబ్బులు ఒక్కోసారి రవాణా ఖర్చులు కాయలు కోసిన ఖర్చులు కూడా రావడం లేదని తెలిపారు రాయలసీమ జిల్లాలోని కడప చిత్తూరు అనంతపురం లలో టమాటో ను అత్యధికంగా సాగు చేస్తున్నారు మదనపల్లి లోని మార్కెట్ రాష్ట్రంలోనే పేరుగాంచింది కడప అనంతపురం జిల్లాల నుంచి కూడా రైతులు పండించిన టమాటాను మదనపల్లి మార్కెట్ కు ఎక్కువగా తీసుకొస్తున్నారు అంత దూరం తీసుకొచ్చిన గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు అమ్మ లేక తిరిగి తీసుకెళ్ల లేక దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం లేదా రోడ్డుమీద పారవేయడం చేస్తున్నారు కడప జిల్లాలోని చిన్నమండెం సంబేపల్లి రాయచోటి గాలివీడు చిత్తూరు జిల్లాలోని కలకడ తంబళ్లపల్లి పెద్దమండ్యం గుర్రంకొండ మదనపల్లి ప్రాంతాల్లో సుమారు 20 వేల హెక్టార్ల పైబడి టమాట సాగు లో ఉందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గత నెలలో కురిసిన చిరుజల్లులతో పంటకు తెగులు సోకి కాయలు బూజు పడుతున్నాయి కాయ పండు మాగి కోసే లోపే చెట్టు పైనే కుళ్ళి పోతున్నాయి కొందరు రైతులు వీటిని కోస్తే కూలీ ఖర్చులు కూడా రావని తోట పైనే వదిలేస్తున్నారు రెండు మూడు నెలల పాటు పొలాల్లో శ్రమించి ఖర్చులన్నీ భరించి చివరకు చేసిన అప్పులు తీరక టమాటా రైతులు విలవిలలాడుతున్నారు ప్రభుత్వాలు సీమ జిల్లాల్లో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని చెప్పినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు దాంతో ఈ ప్రాంత రైతులకు టమాట గిట్టుబాటు ధర కోసం నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది దెబ్బతిన్న తోటలను పరిశీలించి పరిహారాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు
కష్టపడి సాగుచేసిన రైతులను తెగుళ్లు ధరలు వెరసి అప్పుల పాలు చేస్తున్నాయి టమాటో తినే వినియోగదారులకు మార్కెట్లోని దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఎక్కువ అమ్ముతూ ఇద్దరినీ దండుకుంటున్నారు
note ఈ బైట్స్ కు సంబంధించి విజువల్స్ నా 17 తేదీన 57 ఫైల్ లో ఉన్నాయి
ap_cdp_57_17_jk_tamatotegullu_pkg_ap10120

Body:బైట్స్
శ్రీనివాస్ గొల్లపల్లి టమాటా రైతు
గంగులమ్మ గొల్లపల్లి టమాటా రైతు
హైమావతి టమాటా రైతు
రమణ మోటుకట్ల టమాటా రైతు
ప్రభావతి మోటు కట్ల టమాటా రైతు
శివారెడ్డి మోటు కట్ల టమాటా

Conclusion:టమాటో పంటలో తెగులు రైతుకు దిగులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.