ETV Bharat / state

చేదెక్కిన బతుకులు.. బకాయిల కోసం ఫ్యాక్టరీ వద్ద ఆందోళన - arrears pending

చిత్తూరు జిల్లాలో యాజమాన్యాల నుంచి చెరకు రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. పరిశ్రమలు బిల్లులు చెల్లించకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక.. పంటలకు పెట్టుబడులు అందక అవస్థలు పడుతున్నారు. ఆపై ఆగ్రహించి ఆందోళనకు దిగడం.. యాజమాన్యాలు ఓ తేదీని గడువుగా చెప్పి.. చెల్లిస్తామని హామీ ఇవ్వడం.. తీరా తేదీ వచ్చాక డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని భావించి అధికారులకు మొర పెట్టుకోవడం.. జిల్లాలో సాధారణమైపోయింది.

చేదిక్కిన బతుకులు.. బకాయిల కోసం చక్కెర ఫ్యాక్టరీ వద్ద ఆందోళన

author img

By

Published : Oct 17, 2020, 4:45 PM IST

చిత్తూరు జిల్లాలో బకాయి చెల్లింపుల కోసం చెరకు రైతులు నిండ్ర మండలంలో ఆందోళన బాట పట్టారు.

ప్రైవేట్ పరిశ్రమల్లోనే కార్యకలాపాలు..

సహకార రంగంలో రెండు, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో నాలుగు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అందులో రెండు ప్రైవేట్ పరిశ్రమల్లోనే కార్యకలాపాలు జరుగుతుండేవి. రెండున్నరేళ్ల క్రితం బీఎన్‌ కండ్రిగలోని ఓ కర్మాగారం మూతపడింది. యాజమాన్యం నుంచి జిల్లాతో పాటు కడప, నెల్లూరు రైతులకు రూ.36.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

రూ.35 కోట్ల బకాయి..

నిండ్రలోని మరో ప్రైవేట్ పరిశ్రమ సైతం రైతులకు సుమారు రూ.35 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో అన్నదాతలు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రంగంలోకి దిగిన యాజమాన్యాలు అన్నదాతలతో చర్చలు జరిపి.. బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. గడువు దాటినా వారిచ్చిన హామీలు నెరవేరకపోవడంతో అధికారులు వేలం కోసం ముందస్తుగా రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్ కింద నోటీసులిచ్చారు. ఫలితంగా తమ డబ్బులు త్వరగా వస్తాయని చెరకు రైతులు భావించారు.

బదిలీతో మళ్లీ మొదటికి..

ఈ నేపథ్యంలో అప్పటి బీఎన్ ‌కండ్రిగ తహసీల్దారు బదిలీ అయి.. మరొకరు రావడంతో ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. జులైలో వేలం వేస్తారని భావించినా.. కరోనా కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఈనెల 27కు వాయిదా పడింది. నిండ్ర కర్మాగారానికి సంబంధించి ఏడాది గడచినా బకాయిలు రాకపోవడంతో అధికారులు వేలం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత నెలలో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇతర పరిశ్రమకు క్రషింగ్‌కు ఇస్తేనే..

జిల్లాలో నవంబరు నుంచి చెరకు క్రషింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ముందస్తుగా ఓ కర్మాగారంలో కార్యకలాపాలు మొదలు కానున్నాయి.

ఈసారి సందేహమే..

నిండ్ర మండలంలోని పరిశ్రమ నుంచి బకాయిలు రాకపోవడంతో ఈ ఏడాది క్రషింగ్‌ ఉంటుందా లేదా అన్న సందేహం నెలకొంది. కర్మాగారం పరిధిలో 8 మండలాల నుంచి సుమారు 2 లక్షల టన్ను చెరకు ఉంటుందని అంచనా. ఒకవేళ డబ్బులు చెల్లించక.. క్రషింగ్‌ ప్రారంభం కాకపోతే మరో జోన్‌లోని పరిశ్రమకు చెరకు తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. లేని పక్షంలో మధ్యవర్తులకు విక్రయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఖర్చులు పెరిగాయి..

కరోనా కారణంగా కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది పెట్టుబడులు కూడా పెరిగాయని రైతులు అంటున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి అనుమతులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

త్వరలోనే వేలం..

బీఎన్ ‌కండ్రిగ మండలంలోని పరిశ్రమకు సంబంధించి బకాయిల కోసం ఈనెల 27న ఆస్తులు వేలం వేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అయిదు రోజుల క్రితం స్థానిక అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 26 లోపు యాజమాన్యం చెల్లింపులు చేయకపోతే ఆస్తుల వేలం తప్పదు. నిండ్రలోని పరిశ్రమకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత యాజమాన్యం బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నందున క్రషింగ్‌కు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం.

- జాన్‌ విక్టర్‌, అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌

ఇవీ చూడండి:

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.