ఇదీచూడండి ... భూత, చిలుక వాహనంపై విహరించిన శ్రీ కాళహస్తీశ్వరుడు
కనకపుతేరుపై కళ్యాణ వేంకటేశుడు..! - కల్యాణవేంకేటేశ్వరస్వామి
కనకపు రథాన్ని అథిరోహించిన కళ్యాణ వేంకటేశుడు భక్తులకు కన్నుల పండుగ గావించాడు. చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల ఆరోరోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్సవం
ఇదీచూడండి ... భూత, చిలుక వాహనంపై విహరించిన శ్రీ కాళహస్తీశ్వరుడు