చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో కొండలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ.. గొర్రెలు, మేకలు మేపేవారు అధికం. సోమల మండలంలోని ఆవులపల్లికి చెందిన చంద్రబాబు సైతం.. గొర్రెలు కాస్తూ ఊపాధి పొందుతున్నారు. అతనికి చెందిన మందలో.. పుట్టిన ఓ వింత గొర్రె పిల్ల.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అది.. మామూలు గొర్రెలా మాత్రం లేదు. కళ్లు, ముక్కు.. అచ్చంగా కొండముచ్చుకు ఉన్నట్టే ఆ గొర్రెపిల్లకు ఉన్నాయి. ఇలా విభిన్నంగా పుట్టిన ఈ గొర్రెను.. చుట్టుపక్కల గ్రామస్థులు వింతగా చూస్తున్నారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగానే ఉంది.
ఇదీ చూడండి: