సాంకేతిక నైపుణ్యాలకు, పోలీసుల మెరుపు వ్యూహాలకు వేదికగా... నాలుగు రోజుల పాటు అలరించిన స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్- ఇగ్నైట్ తిరుపతిలో ఘనంగా ముగిసింది. ఈ వేడుకలకు హోంమంత్రి సుచరిత, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన పోలీసు సిబ్బందికి హోంమంత్రి పతకాలను, షీల్డులను అందచేశారు.
దేశంలోనే అత్యుత్తమంగా 108 అవార్డులను... రాష్ట్ర పోలీస్ శాఖ గెలుచుకోవటం గర్వకారణమని హోంమంత్రి సుచరిత అన్నారు. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ అమలులోకి రావాలన్న హోంమంత్రి... పోలీస్, జైళ్లు,కోర్టుల వ్యవస్థలు సాంకేతికంగా అనుసంధానం కావాలన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో తిరుమలలో రోజుకు 30నుంచి 40వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారంటే అందుకు తితిదే విజిలెన్స్ సిబ్బందితో పాటు పోలీసుల సహకారం ఎంతగానో ఉందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
మొత్తం 6 ఈవెంట్లలో 200మంది పోలీస్ సిబ్బంది పోటీ పడ్డారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోలీస్ మీట్ కి పంపించనున్నారు.
ఇదీ చదవండి :