శ్రీవాణి ట్రస్టు నూతన విధానానికి భక్తుల నుంచి విశేషస్పందన వస్తోందని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10వేల రూపాయలు ట్రస్టుకు ఇచ్చే భక్తులకు ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన విధానం ప్రారంభించిన నెలలో వెయ్యి మంది భక్తులు విరాళాలు సమర్పించినట్లు చెప్పారు. కరెంట్ బుకింగ్‌తో పాటు ఆన్‌లైన్ విధానంను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. శుక్రవారం 200 టిక్కెట్లు, మిగిలిన రోజుల్లో 500 టిక్కెట్లు ఈ ట్రస్టుకు కేటాయించామన్నారు. పర్వదినాలలో సైతం శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు దర్శనం కల్పిస్తామన్నారు.
ఇవీ చదవండి