చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు అమ్మవారు హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాఢవీధులలో ఊరేగుతున్న అమ్మవారికి భక్తులు కర్పూరహరతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వాహన సేవలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ముత్యాల పందిరిలో విహరించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారు