చిత్తూరు జిల్లాలోని శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో ఎల్లప్ప, సూపరింటెండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురంలో స్వామివారి వసంతోత్సవాలు - శ్రీనివాసమంగాపురంలో స్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.