చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించి కిరణ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి.. చివరికి జైలుపాలయ్యాడు. హుండీలోని నగదు, బంగారు గొలుసును కిరణ్ చోరీ చేశాడు. ఆలయంలో ఈ నెల హుండీ లెక్కింపు చేపట్టగా కిరణ్ విధులకు హాజరయ్యాడు.
ఎవరూ చూడట్లేదని అనుకున్న అతను... రూ 75 వేల నగదు, బంగారు గొలుసు కాజేశాడు. ఇదంతా గమనిస్తున్న పర్యవేక్షణ అధికారులు.. అతన్ని పట్టుకున్నాయి. ఆలయ ఈవో పెద్దరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
NDRF teams deployed: వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం.. ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు