చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.
అనంతరం అర్చకులు వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ధ్వజారోహణం నిర్వహించారు. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని భక్తుల నమ్మకం. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఇదీ చదవండి: చంద్రబాబు అడ్డగింత..వెల్లువెత్తిన నిరసనలు