చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం చౌడ సముద్రం పరిధి గుత్తివారిపల్లిలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్న తండ్రినే హత్య చేశాడు తనయుడు. గ్రామానికి చెందిన గుర్రప్ప నాయుడు(60) డబ్బుల కోసం భార్యను తరచూ వేధించేవాడు. తల్లిని హింసిస్తున్న తండ్రిపై వెంకటరమణ నాయుడు పొడవైన కత్తితో దాడి చేశాడు. పారతో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ నాయుడుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: