ETV Bharat / state

చిత్తూరులో ఆరో రోజు లోకేశ్‌ పాదయాత్ర.. గజమాలతో స్వాగతం పలికిన స్థానికులు

Lokesh Yuvagalam Padayatra: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. కొలమాసనపల్లిలో చెరుకు రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోకేశ్​కి స్థానికులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.

Lokesh Yuvagalam Padayatra
Lokesh Yuvagalam Padayatra
author img

By

Published : Feb 1, 2023, 2:06 PM IST

చిత్తూరులో ఆరో రోజు కొనసాగుతున్న లోకేశ్‌ పాదయాత్ర.. గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు

Lokesh Yuvagalam Padayatra: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. క‌మ్మన‌ప‌ల్లెలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్‌ పాదయాత్రను ప్రారంభించారు. కొలమాసనపల్లిలో చెరకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటూ అందడం లేదని ఎరువుల కొరతతో కర్ణాటక నుంచి ఎరువులు తెచ్చుకుంటున్నట్లు లోకేశ్‌ ఎదుట రైతులు వాపోయారు.

టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసంపై మండిపడ్డ నారా లోకేశ్‌: కోలమాసనపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్సార్​సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ ప్లెక్సీలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. వైఎస్సార్​సీపీ నాయకులకు టీడీపీ ఫ్లెక్సీలు చూస్తే ఎందుకంత భయమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి పసుపు రంగు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా భయం పట్టుకుందని అన్నారు. మా సహనాన్ని పరీక్షించొద్దని మరోసారి మా జోలికి వస్తే తాటతీస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.