UKG Boy Complaint on Traffic Problems: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఓ బుడతడు.. సీఐని కోరాడు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఆదర్శ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల కార్తికేయ.. తమ స్కూల్ దగ్గర తలెత్తిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. స్కూల్ దగ్గర జేసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారని సీఐకి తెలిపారు.
మీరందరూ వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండని కోరడంతో.. సీఐ భాస్కర్ ఎస్సైలు నాగరాజు సుబ్బారెడ్డిలు బాలుడితో సరదాగా కాసేపు ముచ్చటించారు. సీఐ భాస్కర్ తాము అందరూ వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని బాలుడికి తెలిపారు. బాలుడికి స్వీట్ తినిపించిన సీఐ భాస్కర్.. తన ఫోన్ నెంబర్ కార్తికేయకు ఇచ్చారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ బుడతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ 'ఊరంతా' హోలీ.. 48 మందికి గాయాలు