వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వర్ణాభరణాల అలంకరణలో ఉన్న శ్రీ కాళహస్తిశ్వరస్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి హంస, యాలి, స్వర్ణ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఆది దంపతుల ఉత్సవం ముందు వృషభం, ధ్వజ పటాలంతో పాటు పంచ మూర్తులైన వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, ఉమాదేవి సమేతుడైన చంద్రశేఖర స్వామి త్రిశూలం, చండికేశ్వర స్వామి అమ్మవార్లతో సాగారు. భక్తుల కోలాటాలు, వాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగింపు జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఘనంగా కొనసాగుతున్నా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హంస, యాలి వాహనాలపై శ్రీకాళహస్తిశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి ఊరేగింపు ఘనంగా జరిగింది. పట్టణ మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
![శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు Shivaratri Brahmotsavas continue to be great](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6130093-1019-6130093-1582125798741.jpg?imwidth=3840)
వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వర్ణాభరణాల అలంకరణలో ఉన్న శ్రీ కాళహస్తిశ్వరస్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి హంస, యాలి, స్వర్ణ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఆది దంపతుల ఉత్సవం ముందు వృషభం, ధ్వజ పటాలంతో పాటు పంచ మూర్తులైన వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, ఉమాదేవి సమేతుడైన చంద్రశేఖర స్వామి త్రిశూలం, చండికేశ్వర స్వామి అమ్మవార్లతో సాగారు. భక్తుల కోలాటాలు, వాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగింపు జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:
అలనాటి నాణేలు.. ఈనాటి ప్రదర్శనలో..