చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం శంకరాపురం క్రాస్ రోడ్డులో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి కడప జిల్లా రాయచోటికి కారులో తరలిస్తుండగా.. సరుకును గుర్తించిన పోలీసులు.. కారును నిలిపి సోదా చేశారు.
దాదాపు రూ.5 లక్షల విలువ..
అనంతరం కారులో నిషేధిత గుట్కా, పాన్ పరాక్, ఖైనీ ప్కాకెట్లు ఉండటంతో మదనపల్లె స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సరకుతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు కడప జిల్లా రాయచోటికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్, మొఘల్ గవర్నర్ బేగ్లుగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.