తమ భూమిని స్వాధీనం చేసుకొని జీవనాధారాన్ని లాక్కోవద్దంటూ చిత్తూరు జిల్లా పైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లార్లకుంటలో ఓ కుటుంబం పది రోజులుగా దీక్ష చేపట్టింది. గ్రామం సమీపంలో దాదాపు 80 ఏళ్లుగా పోరంబోకు స్థలంలో ఎకరా భూమిని సాగు చేసుకుంటున్నట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం తమ భూమిని అధికారులు లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని నమ్ముకొని 40 మంది బతుకుతున్నామనీ... ఈ భూమిని లాక్కొని... మా జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చెయ్యెద్దని వేడుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి.. తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు. తమ భూమికి పట్టాలివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్.. వ్యక్తిపై కేసు నమోదు