అన్నం పెడుతోన్న బ్యాంకుకే కన్నమేసాడో ఘనుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్ బీఐ బ్యాంకులో బంగారం విలువ చూసే అప్రైజర్ గా పనిచేస్తున్న శివకుమార్, కిలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి..రూ.18 లక్షలు కాజేశాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలపై ఈ దుర్మార్గానికి ఒడికట్టినట్లు అధికార్లు గుర్తించారు. శివకుమార్ చేతివాటంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. శివకుమార్ కు సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: బంగారు దుకాణంలో చోరీ... 30 లక్షల సరకు ధ్వంసం