తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యుల కొరత, వసతుల లేమి రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలోని సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న బాబు అనే వ్యక్తిని.. అత్యవసర విభాగానికి తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేదు. స్ట్రెచర్ తీసుకొచ్చి రోగిని హడావిడిగా తరలిస్తుండగానే అతను మృతి చెందాడు. సకాలంలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించి ఉంటే బాబు మృతి చెంది ఉండేవాడు కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులను తరలించేందుకు కనీసం స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా రుయాను సందర్శించిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్ లేక చనిపోయాడు - ruya-hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, సదుపాయాల లేమితో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ్వరం వచ్చి వెళ్తే ఆస్పత్రికి స్ట్రెచర్ లేక రోగి మృతి చెందాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ సందర్శించిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.
తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యుల కొరత, వసతుల లేమి రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలోని సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న బాబు అనే వ్యక్తిని.. అత్యవసర విభాగానికి తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేదు. స్ట్రెచర్ తీసుకొచ్చి రోగిని హడావిడిగా తరలిస్తుండగానే అతను మృతి చెందాడు. సకాలంలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించి ఉంటే బాబు మృతి చెంది ఉండేవాడు కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులను తరలించేందుకు కనీసం స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా రుయాను సందర్శించిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
Body:జిల్లా లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ వేదికగా శనివారం ఆంధ్ర ప్రదేశ్ హార్టికల్చరల్ శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతుల సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భరత్ గుప్తా మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం లేక పలు గ్రామాలలో నీటి సౌకర్యం లేదని, ఫలితంగా ప్రజలు, పశువులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం రెండు వేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా వర్షపాతం లేక జిల్లా లో మామిడి చెట్లు ఎండిపోతున్నాయని దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లో ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Conclusion: