తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఫ్రీజర్లు లేవంటూ.. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచేందుకు సిబ్బంది నిరాకరించారు. నిన్న రొంపిచర్ల మండల వాసి కరోనాతో ఆస్పత్రిలోనే మృతి చెందగా... అతని అంత్యక్రియలను తిరుపతిలోనే నిర్వహించాలని మృతుడి కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని మార్చురీలో ఉంచాలని సిబ్బందిని కోరారు.
ఇందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. డబ్బుల డిమాండ్ విషయమై మృతుడి బంధువులు ఉన్నతాధికారులకు తెలపగా... మార్చురీలో మృతదేహం ఉంచాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. రుయాలో మృతదేహాలు భద్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురవుతుండగా.. మృతుల బంధువులు బయటి నుంచి ఫ్రీజర్లు సమకూర్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: